గ్రామాల్లో అకారణంగా గొడవలు సృష్టించవద్దని ఎస్సై ఎల్ సంపత్ కుమార్ తెలిపారు, మండలంలోని బొప్పూడి వారి పాలెం. కోమ్మ వరం. వేముల తదితర గ్రామాలలో సోమవారం ఆయన పర్యటించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రతి చిన్న విషయానికి పంతాలు పట్టింపులకు పోవడం మంచి పద్ధతి కాదన్నారు, ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కు వచ్చి సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు, గ్రామాల్లో పేకాట జూదం కోడిపందాలు వేస్తున్నారని తెలిస్తే సహించేది లేదన్నారు, పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్కు వచ్చి పరిష్కరించుకోవచ్చు అన్నారు, గ్రామాల్లో దొంగతనం జరగకుండా చూసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామాల ప్రజల పాల్గొన్నారు.
గ్రామాల్లో సమస్యలు సృష్టించవద్దు
27
Feb