పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

ఇంటర్మీడియట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాలను ఒంగోలు క్రైమ్ అడిషనల్ ఎస్పీ, దర్శి సబ్ డివిజనల్ స్పెషల్ ఆఫీసర్ ఎస్ వి శ్రీధర్ రావు పరిశీలించారు. మండల కేంద్రంలోని ముండ్లమూరు ఆదర్శ పాఠశాల లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిబ్బంది అప్రమంతంగా వ్యవహరించాలన్నారు. సిబ్బంది కాంపౌండ్ లోపల, బయట పర్యవేక్షణ చేయాలన్నారు. బయట వ్యక్తులను లోపలికి వెళ్లకుండా నిరోధించాలన్నారు. ఏదైనా ఆటంకాలు జరిగితే అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్సై ఎల్ సంపత్ కుమార్, పోలీసులు కే అంజిబాబు, ఎన్ కృష్ణయ్య, సచివాలయ మహిళ పోలీసులు ధనలక్ష్మి, అనూష పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *