స్టూడెంట్స్ టీచర్స్ ఎడ్యుకేటర్స్ పె రెంట్స్ (స్టెప్) మంచి వక్తలను తయారు చెయ్యాలన్న సదుద్ధేశంతో ఉత్తమ కార్యక్రమాలను రూపొందించటం అభినందనీయమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం రవీంద్రభారతి స్కూల్లో వక్త ఉచిత శిక్షణా కార్యక్రమం స్టెప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ ….సమాజంలో మంచిని ప్రోత్సాహిస్తూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా నిర్వార్ధంగా ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించటం కొంత మందికే సాధ్యమని అన్నారు. మంచి కార్యక్రమాల నిర్వహణకు స్టెప్ బాధ్యులు నిర్వంచటం సమాజం పట్ల ఎంతో బాధ్యతగా హుందాగా వ్యవహరిస్తున్న బాధ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, స్టెప్ జిల్లా అధ్యక్షుడు అలా అనంత రామయ్య, ట్రైనింగ్ కోఆర్డినేటర్ నర్రా రాజశేఖర్, ఎల్. ఐ.సి డవలప్ మెంట్ ఆఫీసర్ (ఎస్. బి. ఏ) కె. సతీష్ బాబు, వాసు, బండేకర్, తదితర ప్రముఖలు …ఉత్తమ వక్తగా ఎదగటానికి అంశాలు అయిన టైమ్ మెనేజ్ మెంట్, రీ ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్, ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎమోషన్స్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రాక్టికల్స్ చేయించారు. విజేతలకు బహుమతులు ఇచ్చి ప్రోత్సాహించారు. అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.










