తాళ్లూరు మండలంలోని శివరాంపురం గ్రామంలో ఒంగోలు దుర్గా నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఆది వారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 117 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 30 మందికి కంటి చూపు దోషమున్నట్లు గుర్తించివారికి ఆపరే షన్లకు రిఫర్ చేశారు. సాధారణ సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వా హకులు ఆర్ గిరిధర్, ఆర్ లక్ష్మీ సుజాత, బి. విజయలక్ష్మి, వైద్యులు సీతా రామాంజనేయులు పాల్గొన్నారు.
