ఏకా గ్రతే రక్ష- పక్కా ప్రణాళికతో విజయం సొంతం – ఘనంగా పది విద్యార్థులకు వీడ్కోలు సభ

విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పే పదవతరగతి పరీక్షలతో విద్యార్థులు పక్కా ప్రణాళికతో విజయాన్ని సొంతం చేసుకోవచ్చని ఎబీసీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఎబీసీ ఉన్నత పాఠశాలలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ….. పరీక్షల భయాన్ని విద్యార్థులు మూడ్, అండర్ స్టాండింగ్, రీ రీడింగ్, డిఫికల్ట్, ఎఫెక్ట్, రివ్యూ ద్వారా అధిక మించాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ … విద్యార్థులు పూర్తి స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పరీక్షలలో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. విద్యార్థులు తమ వైఖరి, బిలీఫ్, ఆత్మవిశ్వాసం, సంకల్పం, కృషితో విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. కృషి చేయాలని కోరారు . డైరెక్టరు కాలేషాబు మాట్లాడుతూ…. ఏకాగ్రత, సమయపాలన పాటించటం ద్వారా, ఉపాధ్యాయుల మాటలు ప్రేరణగా, తల్లిదండ్రుల కష్టం స్పూర్తిగా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చవచ్చని చెప్పారు. ఎస్ఏలు యలమందా రావు, కొండలరావు, సుబ్బయ్య, హిందీ పండిట్ చిన్నయ్యలు పరీక్షల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. 9వ తరగతి విద్యార్థులు ఘనంగా పది విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *