సకల శుభాలకు నాంది ఉగాది అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
అన్నారు. షడ్రుతువులు, షడ్రుచుల సమూహారం ఉగాది అని తెలిపారు. ఎమ్మెల్యే
మాట్లాడుతూ …చారిత్రక ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, శాలివాహనశకం ప్రారంభమైనదీ, శ్రీ మహావిష్ణువు మత్స్యావతరాన్ని ధరించినదీ, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగినదీ, ధర్మరాజు కిరీట ధారణ చేసినదీ ఉగాది రోజుననేనని పురాణాలు చెప్పుచున్నాయన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిభింబించేలా, సంతోషాలతో ప్రజలు పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం సీఎం వైస్ జగన్ అన్న ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. సుఖ సంతోషాలు,ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ప్రజలందరూ జీవించాలని కోరుకుంటూ నియోజక వర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
సకల శుభాలకు నాంది ఉగాది – ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి
21
Mar