వెంకట్రామయ్యస్వామి తిరునాళ్లు..ఏర్పాట్లను పూర్తిచేసిన నిర్వాహక కమిటీ..

తాళ్లూరులో వెంకట్రామయ్యస్వామి తిరునాళ్లను బుధవారం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తిచేసారు. దశాబ్దాల కాలంగా ఆలయకమిటీవారు ఏటా శివరాత్రి, తదనంతం ఉగాదిరోజున ఉత్సవాలు జరుపుతూ ఉండేవారు. ప్రస్తుతం 86వ వార్షిక ఉత్సవాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్వం తాళ్లూరు గ్రామపంచాయితీ వ్యవస్థాపకులు నెల్లూరు జిల్లా జమీందారీ రైతుసంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేసిన ఇడమకంటి వెంకట్రామిరెడ్డి జమీందార్ చినకోటిరెడ్డి కుమారుడు. ఈయన తత్వవేత్తగా ఉంటూ ప్రజలకు కాలజ్ఞానాన్ని బొధించేవారు. గ్రామంలోని పేదప్రజలకు సహాయసహాకారాలను అందించేవారు. రైతులకోసం రాజానగరం పంటకాలువను నిర్మించి సాగు నీటి వసతిని కల్పించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానాలను బొధిస్తూ ఆయన రెండున్నర దశాబ్దాలక్రితం జీవసమాధికావింపబడ్డారు. ఇక్కడి ప్రజలకు ఆయనపై ఉన్న అపారనమ్మకం ప్రేమలతో ఆయన సమాధిపై దేవాలయాన్ని నిర్మించి అప్పటినుండి తిరునాళ్లను జరిపించేవారు. ‘గతంలో ఈతిరునాళ్లకు ఎంతో ప్రాచుర్యం ఉండేది. దేవాలయం వద్దకు వెళ్లేందుకు దోర్నపువాగు అడ్డంగా ఉండటం సక్రమమైన దారిలేకపోవటంతో భక్తులరాక తగ్గింది. దీంతో ఆయన వంశస్తులు, మనుమడు యిడమకంటి వెంకట్రామిరెడ్డి దేవాలయం వద్దకు వెళ్లేందుకు స్వంత నిధులతో దారిని ఏర్పాటుచేసారు. దీంతో భక్తులకు సౌకర్యంగా ఉన్నది. ఆలయ ప్రాంగణంలో పెద్ద స్టేజీలను కూడ ఏర్పాటు చేయటంతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉన్నది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *