జగనన్న గోరుముద్దతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం – ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి

విద్యార్థులు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ముండ్లమూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా రాగి జావా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థుల్లో కష్టపడి చదివితే ఉజ్జల భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని మరింత నాణ్యతగా పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు . ప్రతి పాఠశాలలో భోజనం తో పాటు అదనంగా రాగి జావ ను విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు. ఎంఈఓ జి, చంద్రమోహన్ మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులకు భావి ప్రపంచంలో పోటీపడుతూ ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. రోజు మెనూలో పిల్లలకు భోజనం పెడుతున్నామని తెలిపారు. ముండ్లమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారంలో ఐదు రోజులు పాటు ఉడికించిన గుడ్లు మూడు రోజులపాటు చిక్కీలు మరో మూడు రోజులపాటు మంగళవారం ,గురువారం, శనివారాల్లో రాగిజావ ఇవ్వనున్నట్లు తెలిపారు. శంకరాపురం సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి మాట్లాడుతూ చిన్నారులకు రుచికరంగా ఆహారం అందివాలన్నారు. విద్యార్థులు మేదో వికాసం పెంపొందించడానికి ఎన్నో చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. పూరి మెట్ల సర్పంచి ఓగులూరి రామాంజి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు దుస్తులు, బ్యాగులు, మధ్యాహ్న భోజనం రాగి జావా, పుస్తకాలు, బూట్లు, ఎన్నో పథకాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్కే హాజరత్ అలీ, మేదరమెట్ల శ్రీనివాసరావు, ప్రభావతి, భారతి, నరసింహారావు, భావన్నారాయణ, బాబురావు , నాగేశ్వరరావు, జ్యోతి, విజయనిర్మల, చక్రపాణి, జి పిలిపి రెడ్డి. జి ఎలీషా, ఎన్ అరుణ కుమారి, శారద, బి చంద్రశేఖర రావు, తదితరులు పాల్గొన్నారు.’

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *