శుభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం నింపాలని ఉగాది పర్వదిన సందర్భంగా బుధవారం గ్రామాలలో దేవాలయాలలో వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. మండలంలోని ముండ్లమూరు, వేంపాడు ,శంకరాపురం పోలవరం నాయుడుపాలెం తమ్మలూరు ,ఉమామహేశ్వరపురం, పూరిమెట్ల , భీమవరం, ఈదర ,మారెళ్ళ, పసుపుగొల్లు, వేముల ,వేముల బండ, ఉలగల్లు, పులిపాడు, మక్కినేని వారి పాలెం ,జమ్మలమడక తదితర గ్రామాలలో దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు.
అందరి జీవితాల్లో శుభాకృత్ ఆనందం నింపాలి – ముండ్లమూరు మండలంలో ఘనంగా ఉగాది వేడుకలు
22
Mar