దర్శి లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో చదువుతున్న బాలికలకు 114 మందికి 1,40,000 విలువగల దుస్తుల ను తాళ్లూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పొట్లూరు శ్రీనివాసరావు, శ్రీ షిరిడి సాయి గానగా మందిరం ట్రస్ట్ చైర్మన్, వేముల బండ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గుమ్మడిల్లి వెంకటరావు లు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉగాది పర్వదిన సందర్భంగా దుస్తులు పంపిణీ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారన్నారు. బాలికలకు దుస్తులు పంపిణీ చేయడం వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది కొనియాడారు. గత కొన్నిల్లుగా విద్యార్థులతో పాటు పేదలకు దుప్పట్లు, నిత్యవసర సరుకులు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు అన్నారు. కార్యక్రమంలో గుమ్మడిల్లి రమాదేవి, రాజవరపు శ్రీనివాసరావు, రాజవరపు రమాదేవి, ఎం రాజమ్మ, కే రజిని తదితరులు పాల్గొన్నారు


