భక్తి శ్రద్ధలతో శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. గుంటి గంగా భవాని, మాధవరం స్వామి, సోమేశ్వరస్వామి, ఆగస్తేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి, సోమవరప్పాడు ఆంజనేయస్వామి, వెంకట్రామయ్య స్వామి ఆలయంలతో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొద్దికూరపాడు మాధవ స్వామి ఆలయంలో క్రిష్ణారావు (రమణయ్య), లక్కవరంలో ప్రకాశరావు పంతులు, అంగస్తేశ్వర స్వామి వద్ద శర్మ ఆధ్వర్యంలో గుంటి గంగా ఆలయం వద్ద పంచాంగ శ్రవణం చేసి ఉగాది పచ్చడి పంచి పెట్టారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈఓ భాస్కర్ రెడ్డి ఆలయాల వద్ద పంచాంగాలు పంచి పెట్టారు. గుంటి గంగ వద్ద ఆర్ఎ శ్రీనివాసరావు పంచాంగాలు పంచిపెట్టారు. తాళ్లూరులో ప్రసాద్ పంతులు పంచాంగ శ్రవణం చేసారు. తాళ్లూరులో ఉగాది పర్యదినాన వెంకట్రామయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు.



