భగవాన్ వెంకట్రామయ్య స్వామి తిరునాళ్ల బుధవారం ఉత్సాహంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులు వెంకట్రామయ్య స్వామిని సందర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వంశస్తులు ఐసీ కోటిరెడ్డి బంధువర్గం ముందుగా ప్రత్యేక పూజలు చేసారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగళ్లు పెట్టుకొని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో పశుసంపదను, కోడేలను, ఎద్దులను ఊరేగింపుగా తప్పెట్లతో స్వామి ఆలయం వద్దకు తీసుకుని వెళ్లి ప్రదక్షణలు చేయించారు. తమ పశుసంపద వృద్ధి చెందాలని, స్వామి వారిని రైతులు వేడుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సంవృద్ధిగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు. స్వామి వంశస్తులు అన్నదానం నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


