ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ పూర్వపు అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాథ్ బుధవారం తుది శ్వాస విడిచారు. ఇటీవల తన హయాంలో విలేకరులకు శిక్షణా తరగతు నిర్వహించి ప్రెస్ అకాడమీ చరిత్రలో తనదైన ముద్రను వేశారు. ఆధునిక అంశాలను జత చేస్తూ నెల్లూరుకి చెందిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుని ప్రెస్ అకాడమీ ద్వారా సర్టిఫికేట్ కోర్సును రూపకల్పన చేసి విలేకరులకుప్రెస్ అకాడమీ బాసటగా నిలిచారు. డిజిటల్ జర్నలిజం విషయము స్పృశిస్తూ ప్రెస్ అకాడమీ నూతన అధ్యాయానికి నాంది పలికారు. ఆయన మృతి పట్ల ప్రెస్ అకాడమీ అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాసరావు శ్రద్ధాంజలి ఘటించారు.
ఏపీ ప్రెస్ అకాడమీ పూర్వపు అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాథ్ మృతి
23
Mar