సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు ప్రతి ఒక్కరికి అందించి వాటిని వేగవంతం చేయాలని ఎంపీడీవో కే కుసుమకుమారి అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశపు హాలులో గురువారం వెల్ఫేర్, డిజిటల్ ,సచివాలయ అసిస్టెంట్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను వసూలు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఆయుష్మాన్ భారత్ లో చేర్పించాలన్నారు. చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలన్నారు. గృహ నిర్మాణాలు చేపట్టుకునే వారికి జాబ్ కార్డు ఉంటే ఇంటి పనులు చేసుకుంటే ఉపాధి ద్వారా మస్టర్లు వేస్తామన్నారు. గృహ నిర్మాణాలు చేపడుతున్న వారికి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించాల్సిన బాధ్యత డ్వాక్రా మహిళలదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డి పి ఓబులేసు, ఏ పీ ఓ కే కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
