యువత భగత్ సింగ్ స్పూర్తితో పోరాటం చెయ్యాలని వక్తలుఅన్నారు. పలు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో భగత్ సింగ్,
రాజ్ గురు, సుఖదేవ్ 92వ వర్ధంతిని నిర్వహించారు. బొద్దికూరపాడు ఎంపీపీఎస్ (ఎస్సీ, విఆర్) పాఠశాలలో గురువారం భగత్ సింగ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారి సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులుశ్రీమన్నారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ కు ఘన నివాళి
23
Mar