వైద్యశాలలో సేవాభావ కలిగి సేవలందించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సూచించారు. ప్రముఖ హోమియో వైద్యులు, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా జమాల్ నర్సింగ్ హోమ్ లో హోమియోపతి ఆస్పత్రిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు హోమియో వైద్యుల శాలను ప్రారంభించారు. అనంతరం ఉచిత అంబు లెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ .. హోమియో వైద్యశాలను ప్రారంభించడం తమకెంతో ఆనందంగా ఉందని డాక్టర్ ఎస్ఎం భాష వైద్యంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వైద్యులు జమాల్ నాయక్, ఎస్ ఎం భాష ,మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.





