ముండ్లమూరు మండలంలోని అన్ని గ్రామాలలో పశువు లైన గేదలు,ఆవులు, గొర్రెలు ,మేకలు కు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని పశు వైద్యాధికారిని ఎం విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 25 శనివారం నుండి వచ్చేనెల ఏప్రిల్ 24 వరకు అన్ని గ్రామాలలో గాలికుంటు టీకాలు వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. పశుపోషక యజమానులు మీ గ్రామాల్లో జరగనున్న పశు వైద్య శిబిరాలకు వెళ్లి మూగజీవాలకు గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని ఆమె తెలిపారు. నాలుగు నెలలు పైబడిన గొర్రెలు, మేకలు ,ఆవులు, గేదెలకు టీకాలు వేయించుకోవాలని ఆమె తెలిపారు.
పశువులకు గాలికుంటు టీకాలు
24
Mar