రైతుల నుండి సర్వే నెంబర్లు సేకరించాలి – ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు

ముండ్లమూరు మండలంలోని గ్రామాలలో భూముల రీ సర్వే కోసం సర్వే నంబర్ల వివరాలను సేకరించాలని ఒంగోలు ఆర్డీవో వి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పోలవరం, పెదరావిపాడు, తూర్పు కంభంపాడు, కె ల్లంపల్లి గ్రామాలకు సంబంధించిన భూములను డ్రోన్ కెమెరా ద్వారా ఫోటోలు తీయడం జరిగిందని ఆ భూములు వివరాలను మండల కార్యాలయానికి వచ్చాయని తెలిపారు. వీఆర్వోలు మీ పరిధిలో గల గ్రామాలలో రైతుల వద్ద నుండి సర్వే నెంబర్లు వివరాలను సేకరించి అధికారులకు తెలియజేయలన్నారు. భూముల రీసర్వై జరిగే సమయంలో వీఆర్వోలు అందుబాటులో ఉండి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవి కాంత్, సీనియర్ అసిస్టెంట్ పి శేషగిరిరావు, మండల సర్వేయర్ శివ ప్రసాద్, వీఆర్వోలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *