ముండ్లమూరు మండలంలో నీ గ్రామాలలో గల భూముల రీ సర్వేకు రెవెన్యూ రికార్డులు సిద్ధంగా ఉండాలని తహసిల్దార్ ఎస్ ఉషారాణి తెలిపారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం రి సర్వే పై వీఆర్వోలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీ సర్వేకు ఎంపిక చేయబడిన గ్రామాల వీఆర్వోలు సంబంధిత రెవెన్యూ రికార్డులు పూర్తిగా అందుబాటులోకి ఉంచుకొని సిద్ధంగా ఉండాలన్నారు. రీ సర్వేలో ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా సర్వే జరిగేంతవరకు సహకరించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్, సీనియర్ అసిస్టెంట్ పి శేషగిరిరావు, మండల సర్వేయర్ శివ ప్రసాద్, వీఆర్వోలు పెద్దన్న, కోటయ్య, దయానందం, మురళి, రవి, గురవయ్య, జాన్ లిపి, రమణ, అయ్యప్ప రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సుశీల, పున్నారావు తదితరులు పాల్గొన్నారు.
