తాళ్లూరు మండలం లక్కవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 8 తరగతి విద్యార్థులు ఐదుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికయ్యారు. వీరికి నాలుగు సంవత్సరాల పాటు రూ. 12వేల చొప్పున ప్రభుత్వం స్కాలర్స్ షిప్స్ అందిస్తారు. పాఠశాలకు చెందిన దినేష్ రెడ్డి, శివ క్రిష్ణ, నాగూర్ వలి, క్రిష్ణ వేణి, సాయి పల్లవిలు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు వెంకట సుబ్బారావు తెలిపారు. గతంలో కూడ 20-21 విద్యాసంవత్సరానికి చెందిన నలుగురు విద్యార్థులు, 21-22 విద్యాసంవత్సరంలో మరో ఇద్దరు జాతీయ ఉపకార వేతన పరీక్ష ( ఎన్. ఎం. ఎం. ఎస్) స్కాలర్స్ షిప్బుకు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం కూడ మరో ఐదుగురు కూడ ఎంపిక కావటంతో విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
జాతీయ ఉపకార వేతన పరీక్షకు ఐదుగురు విద్యార్థుల ఎంపిక
24
Mar