ఆసరాతో జీవనోపాదులు మెరుగుపరుచుకోవాలి -ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా మూడో విడత మంజూరైన వైయస్సార్ ఆసరా నగదు ద్వారా మహిళలు జీవనోపాదులు మెరుగుపరచుకోవాలని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్ఆర్ కాంతి పదం కార్యాలయంలో తాళ్లూరు, ముళ్ళమూరు ,దర్శి ,మండలాలకు చెందిన వైయస్సార్ క్రాంతి పదం సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికి రెండు పర్యాయాలు రుణమాఫీ నగదు అందజేయడం జరిగింది అన్నారు. మూడో విడతగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ,డి బి టి ద్వారా ప్రారంభించడం జరుగుతుందన్నారు. సోమవారం దర్శి, తాళ్లూరు ముండ్లమూరు మండలాలకు చెందిన మహిళల ఖాతాలలో ఆసరా నగదు జమ చేసేలా దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అర్హత గల సంఘాలకు ఈనెల 27వ తేదీన జమ చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం స్థానిక హైస్కూల్ ఆవరణలో మహిళలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దర్శి నియోజకవర్గంలో ఇప్పటివరకు 64 కోట్ల రూపాయలు జామా అయ్యాయన్నారు. మూడో విడతగా 32 కోట్లు జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దర్శి క్లస్టర్ ఏరియా కోఆర్డినేటర్ వసుంధర దేవి, స్త్రీ నిధి మేనేజర్ పవన్ కళ్యాణ్, ముండ్లమూరు ఏపీ ఎం హనుమంతరావు, దర్శి ఏపీఎం విజయ కుమారి, మండల సమాఖ్య అధ్యక్షురాలు తిరుపతమ్మ, పేరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *