వేసవిలో ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ఆరోగ్య కేంద్ర పరిధిలో గల సుంకర వారి పాలెం గ్రామంలో శనివారం వేసవి పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగల కుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. పనుల కోసం పశువుల కాపరులు పొలాలకు వెళ్లే రైతులు తమ వెంట త్రాగు నీరు నీ తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. ఎండ సమయంలో గొడుగు గాని తల కండువా కానీ వెంట తీసుకొని వెళ్లాలన్నారు. అదేవిధంగా గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 55 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. సిబ్బంది పాల్గొన్నారు.
వేసవిలో అప్రమత్తత అవసరం – వైద్యాధికారి బి మధు శంకర్
25
Mar