జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయ అభివృద్ధికి కృషి చేయటం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గుంటి గంగా భవాని ఆలయ సమీపంలో రూ.32లక్షల వ్యయంతో దాతల సహకారంతో నిర్మించిన ఆరు వసతి గదులను శనివారంఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఒక గది నిర్మాణానికి భారీ మొత్తంలో దానం చేసిన వైఎస్సార్సీపీ నాయకుడు, హాట్రిక్ ఎఎంసీ చైర్మన్ మారం వెంకట రెడ్డితో కలసి గదులను ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్న చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావును, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. నిత్యం భక్తుల అధిక సంఖ్యలో వస్తూ ఇక్కడే ఉండి నిద్రించి మొక్కులు తీర్చుకోవాలను కొను భక్తుల అవసరాల కోసం నూతన వసతి గృహాలను చక్కగా ఉపయోగపడతాయని అన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్రియల్ 8న నిర్వహించనున్న గుంటి గంగా భవాని తిరునాళ్ల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం ఎస్పీ నాగార్జున రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్లు మారం వెంకారెడ్డి, ఐ. వేణుగోపాల్ రెడ్డి, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, పార్టీ కార్యదర్శి యాడిక యలమందా రెడ్డి, సొసైటీ చైర్మన్లు మంచాల వలసా రెడ్డి, శనివారపు శ్రీనివాస రెడ్డి, -మాజీ సొసైటీ అధ్యకుడు పలి ప్రసాద్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, సర్పంచిలు సుబ్బారావు , వలి పిఎస్ శ్రీకాంత్ రెడ్డి , మందా శాంసన్ , ఎంపీటీసీ బాలకోటయ్య , దేవస్థాన కమిటీ చైర్మన్ పులి బ్రహ్మారెడ్డి, ముచ్చుమారి బ్రహ్మారెడ్డి ,మాజీ సర్పంచి టీవీ సుబ్బా రెడ్డి, నిశంకం హనుమంతరావు, పులి వికాస్ , ఉప సర్పంచ్ కాశిరెడ్డి, విజిలెన్స్ కమిటీ మెంబర్ సోము అనిల్ కుమార్ రెడ్డి , కుమ్మిత జయరామి రెడ్డి ,ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పూనూరి దేవదానం, శింగయ్య, కటంశెట్టి వెంకటేశ్వర్లు, కూసన గురు బ్రహ్మాంలు పలు గ్రామాల నాయకులు పాల్గొని ఎప్రియల్ 8న నిర్వహించనున్న గుంటి గంగా భవాని తిరునాళ్ల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. నూతన భవన సముదాయం వద్ద క్రిష్ణ స్వామి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ముందుగా మేళ తాళాలలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ భాస్కర్ రెడ్డి, నాగులుప్పలపాడు. ఈఓ చందోలు సుబ్బారావు, చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఆర్ఎ కొట శ్రీనివాసరావులు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలు, వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రను, స్థానిక ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.








