ఆకాశంలో మబ్బులు పట్టి వాతావరణం దోబూచులాడుతుండడంతో వ్యవసాయ రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని నాయుడుపాలెం, తమ్మలూరు, ఉమామహేశ్వరపురం, భీమవరం, ఈదర, ముండ్లమూరు, పసుపుగల్లు, మారెళ్ళ, సుంకర వారి పాలెం, శంకరాపురం. గ్రామాలలో అన్ని రకాల పంటలు కోత దశకు వచ్చాయి, వాతావరణంలో మార్పులు చెంది అక్కడక్కడ వర్షాలు పడుతుండడంతో పంట కోత దశలో ఉండడంతో ఉన్నట్టుండి వర్షాలు కురుస్తుండడంతో రాత్రుల సమయాలలో రైతులు పొలాలకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మిర్చి కాయలు తడుస్తాయని ఆవేదనతో పారదా పట్టలు కప్పి ఉన్నారు. పంట చేతికి అందే సమయంలో మబ్బులు పట్టి చినుకు లు రాలుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంట కాపాడుకునేందుకు నాన్న అవస్థలు పడాల్సి న దుస్థితి ఏర్పడింది. కొద్దో గొప్పో పండించిన పంటకు ధరలు సరిగా లేక దిగులు చెందుతున్నారు. దీనికి తోడు వరుణుడు వెంటాడుతుండడంతో నష్టాలు తప్పదని రైతులు దిగులు చెందుతున్నారు.
ఆకాశంలో మబ్బులు… ఆందోళనలో రైతులు
26
Mar