మహిళా సంక్షేమమే జగనన్న లక్ష్యం- దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

విశాలాంధ్ర ముండ్లమూరు( మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ముండ్లమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వైయస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమం ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా రుణమాఫీ అమలు చేస్తున్న జగనన్నకు మనమందరం అండగా నిలవాలన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి మూడో విడత రుణమాఫీని ఈనెల 28న ప్రారంభించి విడతల వారీగా మహిళల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. వైయస్సార్ ఆసరా పథకం ద్వారా రుణాలు పొందిన మహిళలు ఆదాయ వృద్ధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చందాలన్నారు. దర్శి, తాళ్లూరు, తాలూరు ముండ్లమూరు మండలాలకు సంబంధించి,3074 సంఘాలకు 24 కోట్ల 10 లక్షల రూపాయల రుణమాఫీ చెక్కును అందజేశారు. అదేవిధంగా బ్యాంకు లింక్ చేసే ద్వారా 8 కోట్ల 24 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈనెల 29న జరిగే జాబ్ మేళా కార్యక్రమంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జిల్లా స్థాయిలో జాబ్ మేళా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలతో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పరీక్షలు అంటే భయం విడనాడి ప్రశాంత వాతావరణంలో చదువుతూ పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా చదవగలిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. సీఎం చిత్రపటానికి మహిళా సంఘాలతో పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ మేడికొండ జయంతి, దర్శి నియోజకవర్గ సర్పంచుల సంఘం కన్వీనర్ ఓ గులూరు రామాంజి, దర్శి ఏఎంసీ చైర్మన్ వై వి సుబ్బయ్య, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు సచివాలయ కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి. తాళ్లూరు జడ్పిటిసి మారం వెంకటరెడ్డి. వైసీపీ మండల యువ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి. ముళ్ళమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి. ముళ్ళమూరు సొసైటీ మాజీ అధ్యక్షులు బద్రి వెంకటసుబ్బారెడ్డి. ఏఎంసీ డైరెక్టర్ జిల్లెలముడి శివయ్య, నెమలిదిన్నే సుబ్బారెడ్డి, జనమాల నాగేంద్ర పిచ్చయ్య, గర్నపూడి ప్రసన్నకుమార్, గోపన బోయిన పిలుపు రాజు, తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *