గ్రామాలలోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరాలతో నే ప్రజలు ఆరోగ్యాలు పదిలంగా ఉంటాయని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల శంకరాపురం గ్రామంలో సోమవారం ఫ్యామిలీ ఫిజిషన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 104 వాహనం ద్వారా పెద్దపెద్ద అనుభవం ఉన్న డాక్టర్లచే వైద్య సేవలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలో నీ ప్రజలు ఈ వైద్య శిబిరాలకు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకువెళ్లాలన్నారు. ఈ శిబిరంలో 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఎస్కే హుస్సేన్ బి, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సిహెచ్ఓ కోడూరి శశి, ఏఎన్ఎం ప్రియదర్శిని, డీఈవో వెంకట ప్రసాద్, ఆషాలు తదితరులు పాల్గొన్నారు.
