దేవుడి దగ్గర అందరూ ఒక్కటే – టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి దర్శనానికి వచ్చే అందరూ సమానమేనని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆదివారం చేసిన విమర్శల పై వైవి సుబ్బారెడ్డి సోమవారం తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఓ ధర్మారెడ్డి సమస్యను తనకు తెలియజేశారన్నారు. సదరు ఎమ్మెల్యే 28 మందికి పలు విధాలుగా దర్శనాలు తీసుకున్నారన్నారు. వాటిలో 18 మందికి ప్రోటోకాల్ దర్శనాలు ఇచ్చామని, మిగిలిన 10 మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ఎమ్మెల్యే తనతో వచ్చిన 28 మందికి ప్రోటోకాల్ దర్శనాలు ఇవ్వాలని కోరడంతో అది కుదరదని చెప్పడం జరిగిందన్నారు. దీంతో ఆయన విమర్శలు చేశారన్నారు. తమ నిబంధనలను ఏనాడు అతిక్రమించలేదన్నారు. ఏ పార్టీ వారికైనా నిబంధనలు మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *