డ్రోన్ స్ప్రేయింగ్ తో ప్రయోజనాలు – అడ్వెంట్జ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులచే అవగాహన సదస్సు నిర్వహణ

విజయవాడ రీజియన్
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంకిపాడు గ్రామంలో రిటైలర్ అవగాహన సదస్సు అడ్వెంట్జ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులు నిర్వహించారు. కంపెనీ ప్రతినిధి అయిన మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ఎండి రఫీ అడ్వేంట్జ్ కంపెని గురించి మరియు కంపెని రైతులకు అందిస్తున్న సేవలు గురించి వివరించారు. కంపెనీ లభ్యమయ్యే ఉత్పత్తులైన నవరత్న 20 20 0 13 ఫోకస్ ప్రోడక్ట్ అయిన SPN ఉత్పత్తుల గురించి తెలియజేశారు. అనంతరం రైతులకి డ్రోన్ స్ప్రేయింగ్ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కంకిపాడు గ్రామంలోని ఓ రైతు పంట పొలంలో జొన్న మరియు మొక్కజొన్నకు బయో 20ని ఉపయోగించి స్ప్రేయింగ్ ఏ విధంగా చేయాలో… ఫోపుల్ డ్రోన్ టెక్నాలజీ సీఈవో రాజా వివరించారు. కార్యక్రమంలో అడ్వేంట్జ్ గ్రూప్ కంపెనీ ప్రతినిధులు రీజినల్ హెడ్ కృష్ణ మూర్తి, మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ ఎన్ డి రఫీ, సిసిఎం రవిచంద్ర, ఫోపుల్ డ్రోన్ టెక్నాలజీ సీఈవో గోపి రాజా, రిటైల్ డీలర్స్ మరియురైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *