ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు -‘రాహుల్ పై అనర్హత వేటు సరికాదు’

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని పార్టీ దర్శి నియో జక వర్గ ఇన్ఛార్జి పుట్లూరి కొండారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక గడియార స్తంభం కూడ లిలో పార్టీ నేతలతో కలిసి నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. భాజపా అరాచకాలను ప్రశ్నిస్తున్నారన్న కక్ష సాధింపుతో ఎంపీ రాహుల్ గాంధీని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పుట్లూరి కొండారెడ్డి ఆరోపిం చారు. అదానీ గ్రూపునకు దేశ సంపదను దోచి పెడుతున్న మోదీని ప్రశ్నించటమే రాహుల్ చేసిన తప్పా అని… ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థలు, న్యాయ స్థానాలను సైతం ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్ణా పుల్లారెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సిరిమల్లె పౌలేష్, నాయకులు చినకోటయ్య, ప్రభుదాస్, రమణారెడ్డి, జయసింహారెడ్డి, కరిమల, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *