ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటుందని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి అన్నారు. మండలంలోని మారెళ్ళ గ్రామంలో గల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆ గ్రామ సర్పంచి గోపన బోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా 74 రకాల మందులు 12 రకాల టెస్టులతో పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తుందన్నారు. గ్రామ సర్పంచి గోపన బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు వైద్యాధికారులు సిహెచ్ ప్రవీణ్ కుమార్, బి మధు శంకర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం రిపేరు, ఆపరేషన్ థియేటర్ రిపేరు, పేషంట్లకు నీరు అందించాలని, గర్భిణీలకు ఫ్యాన్స్ సౌకర్యం కల్పించాలని, ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని మిషన్లకు బ్యాటరీలు ఏర్పాటు చేయాలని, ల్యాబ్ కొరకు కెమికల్స్ అందించాలని, ఆరోగ్య కేంద్రానికి అన్ని రకాల వస్తువులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈదర సర్పంచి వంగల పద్మావతి శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సిహెచ్ఓ వెంకట్రావు హెచ్ వి ఎస్కే హుస్సేన్ బి., తదితరులు పాల్గొన్నారు.

