నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం -ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి మార్కెట్ యార్డ్ లో ఆంధ్రప్ర దేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాన్, జిల్లా ఉపాధి కార్యాలయాలు సంయుక్తంగా నిర్వ హించిన జాబ్ మేళాకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 391 మంది ఉద్యోగాల కోసం హాజరు కాగా వారిలో 122 మంది పలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 55 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …యువ తకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలా జాబ్ క్యాలెండర్లు విడుదల చేసి జాబేళాలు నిర్వ హిస్తున్నారని చెప్పారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలు పాల్గొనగా 650 ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాలు పొందాలని సూచించారు. డీఎస్ఓఓ లోక నాథం మాట్లాడుతూ…. ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుల ఆధ్వర్యంలో జాబేళాలు నిర్వ హించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తు న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాధికారి ఆర్ లోక్నాథం, డీఈఓ టీ భర ద్వాజ్, జేడీఎం రజినీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, ఎంపీపి సుధాఅ చ్చయ్య, వైస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డిగ్రీనరీ అండ్ బ్యూటిఫి కేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మండల కన్వీ నర్ వెన్నపూస వెంకటరెడ్డి, , రోటరీ క్లబ్ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సచి వాలయం కన్వీనర్ వీ కోటిరెడ్డి, కౌన్సిలర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *