జర్నలిజంలో డిప్లోమా కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎపి సమాచార పౌర సంబంధాల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ

సమాజ చైతన్యమే లక్ష్యంగా పనిచేసే జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ “జర్నలిజంలో డిప్లోమా కోర్సు” ప్రారంభించడం ముదావహం అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ అన్నారు. ఇందుకు ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ను మంత్రి అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రంలో జర్నలిజంలో డిప్లోమా కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ ను మంత్రి విడుదల చేశారు. ప్రభుత్వఆధ్వర్యంలో తొలిసారిగా “జర్నలిజంలో డిప్లోమా కోర్సు” ను ప్రెస్ అకాడమి ప్రారంభించడం జర్నలిస్టులకు, ఆ రంగంలో అభిరుచి వున్న అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశంగా మంత్రి అభివర్ణించారు. జర్నలిస్టుల కలానికున్న బలాన్ని మరింతగా మెరుగులు దిద్దుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు సంబందించిన హెల్త్ కార్డుల విషయమై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా హెల్ప్ లైన్ లో ప్రత్యేకంగా నెంబరు 4 ను పొందుపరుస్తున్నట్లు మంత్రి తెలిపి, ఆ మేరకు వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సి.ఈ.ఓ. ప్రెస్ అకాడమి చైర్మన్ కు పంపిన లేఖను కార్యక్రమం లో చదివి వినిపించారు. 8 వేల 699 మంది వర్కింగ్ జర్నలిస్టులకు, వారికి చెందిన 26 వేల 800 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉచిత వైద్య సేవలు అందుతున్నట్లు మంత్రి ఆ లేఖ లో పేర్కొన్న విషయాన్ని జర్నలిస్టుల దృష్టికి తెచ్చారు. ఉచిత వైద్యసేవల అందుబాటులో సమస్యల పరిష్కార మార్గాలతో బాటు, జర్నలిస్టులు రచించిన పుస్తకాలు గ్రంథాలయాల ద్వారా కొనుగోలు చేసేందుకు అంగీకరింపచేసిన ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఉత్తరువులు శుక్రవారం విడుదల కానున్నట్లు మంత్రి ప్రకటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ .. .. అన్ని సంస్థలు, ప్రభుత్వాలు ప్రజా సంబంధాల పై దృష్టి పెట్టిన నేపాధ్యంలో జర్నలిజం లో డిప్లొమో అవసరాన్ని తాము గుర్తించి, వర్కింగ్ జర్నలిస్టులకు, అభిరుచి వున్న ఇతర అభ్యర్థులకు ప్రయోజనకరం గా ఉండేలా రూపొందించామని చెప్పారు. ఈ డిప్లొమో కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసినందుకు ఆయన మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పత్రికారంగానికి ఆద్యులైన కందుకూరి వీరేశలింగం వంటి ప్రాంతమైన రాజమహేంద్రవరం నుండి “జర్నలిజంలో డిప్లోమా కోర్సు” ను ప్రెస్ అకాడెమీ ప్రారంభించడం సంతోష దాయకమన్నారు. శుక్రవారం (31. 03. 23) నుంచి ప్రెస్ అకాడమి వెబ్ సైట్ pressacademy.ap.gov.in నుండి ఈ కోర్సుకు సంబంధించిన దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించారు. అడ్మిషన్ ల కోసం చివరి తేది 15. 04. 2023 గా నిర్ణయించారు. కోర్సుకు సంబంధించిన సందేహాలకు 9154104393 మొబైల్ నంబర్ కు కాల్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కోర్సు మెటీరియల్ రూపొందించేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఇన్ చార్జ్ (ఎల్ యస్ యస్ బి) ఎల్. వి. కె రెడ్డి, నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగపు అధిపతి డా. జి అనిత, ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం రిటైర్డ్ ప్రొఫెసర్ పి. బాబీ వర్ధన్ ల సారధ్యంలో కోర్సు మెటీరియల్ రూపొందించడం జరిగిందన్నారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నిబంధనలకనుగుణంగా కోర్సు మెటీరియల్ రూపొందించామని ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సపోర్ట్ సర్వీసెస్ డైరెక్టర్ ఎల్. వి. కె రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ ప్రదానం వంటి అంశాలు నాగార్జున యూనివర్సిటీ ద్వారా జరుగుతాయని ఆయన వివరించారు. జర్నలిస్టులకు కోర్సు ఫీజు రూ. 1500/- గాను, ఇతరులకు రూ. 2000/- గాను నిర్ణయించడం జరిగిందన్నారు. ఓపెన్ యూనివర్సిటీ ఫీజులుకంటే ఇవి తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. సమావేశం లో శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ప్రెస్ అకాడమీ సెక్రెటరీ ఎం. బాలగంగాధర తిలక్, రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మండేల శ్రీ రామ మూర్తి, అధ్యక్షులు కుడుపూడి పార్ధ సారధి, ప్రెస్ అకాడమి కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా ప్రెస్ అకాడమీ తరపున సీనియర్ పాత్రికేయులు ఏ. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి, చిరుకూరి సాయి బాబా లను ప్రెస్ అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *