పేదల అభ్యున్నతికి వైఎస్ఆర్సిపి కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు వైఎస్ఆర్సిపి నాయకుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభ పై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ …నిరంతరం దర్శి నియోజకవర్గం అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం ప్రజలలోనే ఉంటూ ప్రజల సమస్యలను. తక్షణ పరిష్కారానికి మద్దిశెట్టి సోదరులం కృషి చేస్తున్నట్లు తెలిపారు . ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా కార్యకర్తలకు వెన్నంటే ఉంటామని అన్నారు. అనంతరం ప్రభ నిర్వాహకులు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ….ముఖ్య అతిథి డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు.


