తాళ్లూరు మండలంలోని పది పరీక్షా కేంద్రాలను ఎస్సై ప్రేమ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. బొద్దికూరపాడు, తూర్పు గంగవరం, తాళ్లూరులలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించి పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆయా పాఠశాలల డీఓలతో, చీఫ్ తో మాట్లాడారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెయ్యాలనిసూచించారు. అవసరమైన బందోబస్తును అందిస్తామని చెప్పారు.



