అకాల వర్షానికి కుప్పకూలిన పూరిగుడిసె

ముండ్లమూరు మండలంలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మండల కేంద్రమైన ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో గల పోలేరమ్మ ఆలయం వద్ద గల పూరి పాక కుప్పకూలింది. అదే సమయంలో వర్షం పడుతుండగా 6 మంది యువకులు పూరి పాకలోకి వెళ్లారు. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురవడంతో పూరిపాక కుప్ప కూలింది. పూరి పాకలో ఉన్న 6 మంది కి ఎటువంటి గాయాలు కాలేదు .దీంతో లోపల నుండి బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా భారీ వర్షం కురవడంతో సైడ్ కాలవలు నుండి కనగండ్ల సుధాకర్, పేరంగం నవమ్మ, ఇంటిలోకి మురుగునీరు చేరింది. దీంతో ఆ మురుగు నీటిని బకెట్ల ద్వారా బయటకు పోశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *