ముండ్లమూరు మండలం లో ఈనెల ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి జూలై వరకు నాలుగు నెలల పాటు పశుసంవర్ధక శాఖ, పశుగనాభివృద్ధి సంస్థవారి సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో పశువు లైన ఆవులు, గేదలు, ఎద కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ లు ఉచితంగా వేయడం జరుగుతుందని ముండ్లమూరు పశు వైద్యాధికారిని ఎం విజయలక్ష్మి శనివారం తెలిపారు. పశు వైద్యశాలలో, గ్రామీణ పశు వైద్యశాలలో, గోపాల మిత్రులు రైతు భరోసా కేంద్రాలలో ఈ సదుపాయాన్ని ఆయా గ్రామాల్లోని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
పశువులకు ఉచితంగా ఎద ఇంజక్షన్లు
01
Apr