ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులో సోమవారం నిర్వహించిన పదవ తరగతి మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మూడు కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 460 మంది విద్యార్థుల హాజరు కావలసి ఉండగా, 458 మంది హాజరైనారు. ఇద్దరూ గైర్హాజరైనారు. ఈ మూడు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్ట మైన ఏర్పాటు చేశారు. మాస్ కాఫీఇంగుకు పాల్పడకుండా వీలు లేకుండా చేశారు. విద్యార్థులను లోపల కు పంపించే సమయంలో తనిఖీలు నిర్వహించే లోపలికి పంపించారు. ఈ పరీక్ష కేంద్రాలను దర్శి సీఐ జే రామకోటయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.



