గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష -హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం.
దానితర్వాత కార్యక్రమానికి కాస్తగ్యాప్‌ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా గ్యాప్‌ వచ్చింది. మార్చి 16వరకూ కోడ్‌ కొనసాగింది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.
తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్‌ వచ్చింది.

మళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలి. గేర్‌ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి. అందుకే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దేవుడి దయ వల్ల రాష్ట్ర చరిత్రే కాదు దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్షకు తావులేకుండా, లంచాలకు అవకాశం లేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది.

రాష్ట్రంలో అర్బన్‌ ప్రాంతంలో 84శాతం, రూరల్‌ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా సగటున 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం. ఆ ఇళ్లల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగింది. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు.
87శాతం కుటుంబాలను గమనించినట్టైతే అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం. ఇందులో పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్‌ చేసి మరీ వారికి పథకాలు అందిస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం. మనం రాకమునుపు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6వేలు ఉన్న బీపీఎల్‌ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు ఇచ్చాం. గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12వేలు సంపాదించే ప్రతి పేదవాడికి మంచి చేయాలని అడగులు వేశాం. ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం.

ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు.
21 స్థానాల్లో ఎన్నికలు జరిగితే … 17 స్థానాల్లో మనం గెలిచాం.

మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు. కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం జరుగుతున్న అపోహలకు సంబంధించి, వీళ్లు సృష్టిస్తున్న దుష్ప్రచారాలకు సంబంధించి కొన్ని వాస్తవాలు తెలుసుసండాలి.

ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి.
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే ఎమ్మెల్సీ స్థానం.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో 87 శాతం ..అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి. నేరుగా బటన్‌ నొక్కుతున్నాం. వారికి మంచి జరుగుతుంది.

అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మనం 87 శాతం ఎవరికైతే మంచి చేశామో వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువ. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లలో దాదాపుగా ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు 80 శాతం మంది డీబీటీలో లేనివారు. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు. ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది.
మరోక అంశం…. ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యంం మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి.
మిగిలిన పార్టీలంతా కలిశాయి. మనం ఒక్కరిమే.
అయినప్పటికీ కూడాం తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు. రెండో ప్రాధాన్య ఓటు బదిలీ కావడం వల్ల, ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు ఉంది కాబట్టి జరిగింది. ఇది ఏ రకంగానూ ఎఫెక్ట్‌ కాదు. అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రొజెక్టు చేసుకోవడం, దానికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ–5 చూపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నాం.

రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు.
50– 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు. ఆ జాబితాలో ఇంతమంది వెళ్లిపోతున్నారు. ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
ఇంతకంటే.. దారుణమైన ఎమ్మెల్యే ఉండరని మన పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యేపైనా ప్రచారంచేస్తున్నారు.
ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఈ ప్రచారాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం.
చంద్రబాబు అనే వ్యక్తి ఒక ముసుగు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, పవన్‌ కళ్యాణ్‌ ఇంత మంది కలిసి మారీచులు. గజదొంగల ముఠా.
దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది. మరలా అది చేసుకునేందుకు చంద్రబాబును అక్కడ కూర్చోబెట్టి.. దోచుకో, పంచుకో, తినుకో కార్యక్రమం కోసం మరలా గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి.

రూమర్లు వస్తాయన్న సంగతి మనకు తెలిసి ఉండాలి. వాటిని తిప్పికొట్టే కార్యక్రమం చేయాలి. ప్రతి ఊరులోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ చెప్పాలి.

సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సంవత్సరం టైం ఉంది. మరలా కేడర్‌ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలి. సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉధృతం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి.
ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి. ప్రతి లబ్ధిదారు ఒక ప్రచారకర్త కావాలి. వాళ్లకు జరిగిన మంచిని నలుగురితో పంచుకోవాలి.

సచివాలయ కన్వీనర్లను, గృహసారథులను మమేకం చేయాలి. వీళ్లంతా మమేకమై …. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలి. ఇది మీరు కచ్చితంగా చేయాలి.

దాదాపుగా ఇప్పటికే సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం. దాదాపు 15వేల సచివాలయాలు ఉంటే సగం పైగా పూర్తయ్యాయి. 80–90 సచివాలయాలు ఒక నియోజకవర్గంలో ఉంటే.. సగం పూర్తయినా మిగిలిన సగం కూడా త్వరగా పూర్తిచేయాలి. ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి.నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి.
సెప్టెంబరు నాటికి ఈకార్యక్రమం పూర్తయితే ఆ తర్వాత నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం.
ఒకవైపున గడపగడపకూ జరుగుతుందిం రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి. వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం.

రాజకీయాలంటే మానవ సంబంధాలు..
రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను. ఏ ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మాటలను నమ్మొద్దు. మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.. ఈ అడుగులన్నీ కూడా దానికోసమే. మరలా మీరంతా గెలిచి రావాలనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.

అదే సమయంలో కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు. మనం సరైన పద్దతుల్లో పనిచేయక, ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం. మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. అందుకే మన గ్రాఫ్‌ పెంచుకోవాలి. గ్రాఫ్‌ పెరగాలంటే ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి.

అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి.ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్‌ పెరుగుతుంది.

నేను చేయాల్సింది.. నేను చేయాలి. మీరు చేయాల్సిది మీరు చేయాలి. బటన్‌ నొక్కడం నేను చేయాల్సింది చేస్తాను. మీరు తిరగడం ఆపకూడదు. ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం. ఇది వాస్తవం.
ఈ విషయాన్ని గుర్తుంచుకుని వేగంగా అడుగులు వేయాలి.

జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ఏఫ్రిల్‌ 7 న ప్రారంభిస్తున్నాం. ఏప్రిల్‌ 20 వరకు జరుగుతుంది. సచివాలయ కన్వీనర్, గృహసారధులను ఏకం చేసి.. వీళ్లందరితో ఈ కార్యక్రమాన్ని చేయించాలి. గ్రామస్ధాయిలో ఉన్న మన వ్యవస్ధను ఒక్కటి చేస్తున్నాం. వీళ్లని ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది పక్కాగా జరగాలి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటికి వెళ్లేలా ఈ కార్యక్రమం జరగాలి.

ఈనెల 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమం.
ఇండివిడ్యువల్‌ గ్రీనెన్సెసెస్‌ను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా రేషన్‌ కార్డు స్ప్లిట్‌ కాకపోవడం వంటి సమస్యలు గ్రామంలో ఒకటి అరా ఉంటే వాటిని కూడా మిస్‌ కాకూడదని ఇండివిడ్యువల్‌ గ్రీవెన్స్‌సెస్‌ను పరిష్కరించడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.ఈ నెల 13న ఈ కార్యక్రమం చేపడుతున్నాం. నేరుగా ఎవరికి సమస్య ఉన్నా నేరుగా నాకే ఫోన్‌ చేయవచ్చు.
వాటిని కూడా పరిష్కరిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *