చీమకుర్తి మండలంలోని రామతీర్ధం తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ అధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యుత్ ప్రభ తడిక తరలింపు కార్యక్ర మాన్ని సోమవారం కోలాహలంగా నిర్వహించారు. ప్రభ తడికను ట్రాలీ వాహనంపై ఉంచి చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మం డపం వద్ద నుంచి భారీ ఊరేగింపుగా చీమకుర్తి మెయిన్ రోడ్ మీదుగా రామతీర్ధంలోని గంగమ్మ సన్నిధికి తరలించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకుంది. వైఎస్సార్ సీపీ శ్రేణులు కదంతొక్కగా, అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.










