కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న వివిధ విభాగాల కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగులు అన్నారు. స్థానిక మండల కేంద్రంలో గల ఎంఈఓ ఆఫీసు, హై స్కూల్, కేజీబీవీ పాఠశాల వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల కు తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పి ఆర్ సి ని అమలుచేసి వేతనాలు పెంచాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను సమాన పనికి సమాన వేతనం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలని,, కరువు భత్యం, ఇంటి అద్దె సౌకర్యం, గ్రాడ్యుటి కల్పించాలని, సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సీనియార్టీ ప్రాతిపదికన అన్ని విభాగాలకు వార్షిక ఇంక్రిమెంటు అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, మెరుగన్న హెల్త్ స్కీము అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని, ఎక్స్ గ్రేషియా 20 లక్షల పెంచాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకొని కారుణ్య నియామాల కింద ఉద్యో గాలు ఇవ్వాలని కోరుతూ సచివాలయం ప్ల కార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిలుపి రెడ్డి, కోటి సాహెబ్. ఎస్.కె చిన్న కాసిం, ఎస్ కోటేశ్వరరావు, వి శాంతి, జి మరియమ్మ, ఈశ్వరరావు, ఎన్ వాణి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *