వాలంటీర్లు బాధ్యతగా పని చేయాలి

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువు చేయడంలో వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని మండల పరిషత్ ఏవో బి రామాంజనేయులు, ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పులిపాడు పంచాయతీలో నూతనంగా ఎంపిక కాబడిన కుంటా అనిల్ కు వాలంటీర్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ టీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *