సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువు చేయాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గృహసారథులు అర్హులకు అందేలా కష్టపడి పని చేయాలని మండల సచివాలయ కన్వీనర్ మేడికొండ జయంతి, మండల వైసిపి యువ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. మండలంలోని పసుపుగల్లు సచివాలయంలో మంగళవారం గృహసారధులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటివరకు నాలుగేళ్ల పాలనలో ప్రతి ఇంటింటికి లబ్ధి చేకూరిన వివరాలు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం గృహసారధులకు ప్రభుత్వ కి ట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పసుపుగల్లు ఎంపీటీసీ దాసరి పెద్ద అంజయ్య, హనుమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *