స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త భారత అమూల్య రత్న బాబూ జగ్జీవన్ రామ్ అని వక్తలు అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు మాట్లాడుతూ …అతి చిన్న వయస్సులోనే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించిన వ్యక్తి అని పొలిటికల్ కింగ్ మేకర్గా రాజకీయాలలో రాణించి అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన స్వంతం అని ఆయన జీవిత చరిత్రను గుర్తు చేసారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి. శ్రీనివాసరావు, వైస్ -ఎంపీపీ ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, ఎం.ఈఓ జి. సుబ్బయ్య, ఈఓ ఆర్టీ ప్రసన్నకుమార్, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, జెసీఎస్ మండల కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, ఎఈ అశోక్, పులి వికాస్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
‘భారత అమూల్య రత్న” బూబు జగ్జీవన్ రామ్ – ఘనంగా బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు
05
Apr