ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్- ప్రజల సమస్యలపై తహసీల్దార్ మాట్లాడుతున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి
జనం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్ రెడ్డి నిర్విరా మంగా కష్టపడుతున్నారని, సీఎం కృషిని గుర్తించి తిరిగి మరల సీఎంను జనం ఆదరించాలని దర్శి శాసనసభ్యుడు డాక్టర్ మద్ది వేణుగోపాల్ కోరారు. కురిచేడు మండలంలోని సచివాలయం పరిధి పేరంబొట్లపాలెం, కాటంవారిపల్లెలో ఆయన గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రజల కోసం గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంతగా ప్రజల వద్దకే అధికారులను పంపి అనేక సేవలు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదే నన్నారు. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం ద్వారా చేకూరిన లబ్ధిని ఆయన ప్రతి ఇంటి వద్ద ప్రస్తావించారు. అంతే కాకుండా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ కేసనపల్లి కృష్ణయ్య, పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ సైదా, మండల సచివాలయాల కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, దర్శి ఏఎంసీ వైస్ చైర్మన్ కె.నాగేశ్వరరావు, ఎంపీటీసీలు బుల్లం వెంకట నర్సయ్య, కానాల శివా రెడ్డి, కురిచేడు మాజీ సర్పంచ్ పోతిరెడ్డి నాగిరెడ్డి, కురిచేడు సొసైటీ ప్రెసిడెంట్ మర్రి సుబ్రహ్మణ్యం, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

