గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల బలవర్ధక మైన ఆహారం తీసుకోవాలని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల ఈదర, ఉమామహేశ్వరపురం గ్రామాలలోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు శంకర్ మాట్లాడుతూ గర్భిణీలు అవగాహనతో ఆరోగ్యంపై జాగ్రత్తల పాటించాలన్నారు. వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున ఎండలలో ఎక్కువగా తిరిగినట్లయితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు ఎండలు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయాలన్నారు. ఎండలలో పనులు చేయడం ద్వారా వడదెబ్బలు తగులుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిశుభ్రత పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రత పాటించాలన్నారు.12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు లోపు గల ఆడపిల్లలు రక్తహీనత గురించి తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. ఈ శిబిరంలో215 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సిహెచ్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సిహెచ్ ఓలు జయశ్రీ, దీప్తి, డీఈఓ వెంకటప్రసాద్ ఏఎన్ఎం గౌస్ మున్నిసా, ఆశాలు పాల్గొన్నారు.



