ఘనంగా గుంటి గంగా తిరునాళ్లు ప్రారంభం – అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పొంగళ్లుపెట్టి మొక్కులు తీర్చుకున్న మహిళలు – ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి

గుంటి గంగా భవాని తిరునాళ్లు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయం ప్రాంగణం వద్ద శనివారం ఉదయం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక శాంతి, గావు కార్యక్రమాలు నిర్వహణ అనంతరం తిరునాళ్ల ప్రారంభమైనది. జిల్లాతో పాటు ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి పొంగళ్లను నైవేద్యాలుగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుండే భక్తుల రాకతో గుంటి గంగా భవాని ప్రాంగణం భక్తులతో కిట కిట లాడింది. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు, రైతులు ట్రాక్టర్లలో అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పొంగళ్లను పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. గంగా భవాని ఆలయంతో పాటు శివాలయం, శ్రీకాశినాయన ఆశ్రమం, శ్రీ క్రిష్ణాలయం. బ్రహ్మంగారి దేవాలయం. నాగుల స్వామి పుట్ట భక్తులతో కిట కిటలాడాయి. వివిధ కులాలకు చెందిన సత్రముల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అన్ని కులాల అన్నదాన సత్రాలలో అన్నదానం చేసారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసారు. శ్రీలక్ష్మి శ్రీనివాస మార్బుల్స్, టైల్స్ చీమకుర్తికి చెందిన వారు లడ్డు, పులిహోర, వాటర్ ప్యాకెట్స్ ను, పలు స్వచ్ఛంత సంస్థలు మజ్జిగ, ప్రసాదాలు, మంచినీటిని అందించారు. ఈఓ భాస్కరరెడ్డి, ‘సిబ్బంది శ్రీనివాసరావు, పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి ..

జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా శనివారం ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ దంపతులు, వైఎస్సార్సీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వరరెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డిలకు, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, జి సి ఎస్ కన్వీనర్ యాడిక శ్రీనివాస రెడ్డి , సర్పంచిలు, ఎంపీటీసీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టిని, మద్దిశెట్టి రవీంద్రను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మండల పార్టీ బాధ్యులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తడిక ప్రభను తరలించిన టిడీపీ శ్రేణులు ..

|శివరామపురంకు చెందిన టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన తడిక ప్రభను తరలించారు. ఆపార్టీ నాయకుడు పమిడి రమేష్ ప్రత్యేక పూజలు చేసి ప్రభను తరలించారు. పలు గ్రామాలకు చెందిన టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

విద్యుత్ వెలుగులో గుంటి గంగ కళ కళ 11 విద్యుత్ ప్రభల ఏర్పాటు – చల్లగా చూడాలని అమ్మవారికి వేడుకోలు

గుంటి గంగా భవాని జాతర సందర్భంగా శనివారం రాత్రి అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలతో గంగా భవాని సన్నిధి కళ కళ లాడినది.
గంగమ్మ తల్లి కరుణ కోసం మండల ప్రజలు కొండ కోనల మధ్య 11 విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసారు. ప్రభలతో వెదజల్లిన వెలుగులతో గంగ కొండ కళా వంతమైనది. వైఎస్సార్సీపీ మద్దతు దారులు ఏడు ప్రభలు, టీడీపీ, జనసేన మద్దతు దారులు రెండేసి చొప్పున ఏర్పాటు చేసారు. ప్రభలను గుంటి గంగా భవాని అమ్మవారి దేవాలయానికి ఇరువైపుల ఏర్పాటు చేసారు. గంగా భవాని అమ్మవారి ఆలయానికి విద్యుత్ బల్చులతో ప్రత్యేకంగా అలంకరించారు.

పటిష్ట బందో బస్తు…

గుంటిగంగాభవానీ తిరునాళ్లకు దర్శి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 30 మంది ఎస్సైలు, మూడు ప్రత్యేక పార్టీలతో తో దాదాపు 600 మంది బారీబందోబస్తు ఏర్పాటు చేసారు. డీఎస్పీ ఆధ్వర్యంలో దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సై ప్రేమ్ కుమార్ లు నిత్యం పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి శాంతి భద్రతలు పర్యవేక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *