చేపల చెరువులకు చేరుతున్న వ్యర్ధాలు – ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు

ముండ్లమూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చేపల చెరువులకు పెద్ద ఎత్తున వ్యర్ధాలు తరులుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చేపల చెరువులకు లారీలలో గేదెల ,కోళ్ల వ్యర్ధాలు ఇష్టానుసారంగా లారీల్లో తరలించి చేపల చెరువులకు, చేపలకు ఆహారంగా వేస్తున్నారు. దీంతో ఆ చేపలు తినడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పోలీసులు రెవెన్యూ అధికారులు చేపల చెరువు వైపు కన్నెత్తి చూడకపోవడంతో చేపల చెరువుల నిర్వాహకులు యదేచ్చగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మండలంలోని తమ్మలూరు, చింతలపూడి, ఉమామహేశ్వరపురం గ్రామాల పరిధిలో ఉన్న చేపల చెరువులకు నిత్యం వ్యర్ధాలు చేరుతున్నాయి. అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, చెన్నై, బెంగళూరు, మోదేపల్లి, నుండి వ్యర్ధాలు లారీల్లో తరలిస్తున్నట్లు సమాచారం, వందల ఎకరాల్లో అనుమతులు లేకుండా చేపల చెరువు లు సాగు చేస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖ అధికారులకు తెలిసిన గుట్టు చప్పుడు కాకుండా మామూలు మత్తులో మునిగితేలుతు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా గ్రామస్తులు వ్యర్ధాలతో దుర్వాసన వస్తుందని ప్రశ్నిస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. పలు పర్యాయాలు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *