పాప క్షమాపణలకు ప్రతీక ఏసుక్రీస్తు

పాప క్షమాపణలకు ప్రతీక ఏసు ప్రభువని పాస్టర్ గురు స్వామి అన్నారు. పులిపాడు లోని అద్దంకి రంజిత్ ఓఫిర్ ప్రవక్త చర్చిలో ప్రార్థనలు జరిగాయి. మండలంలోని పులిపాడు, ముండ్లమూరు, ఉల్లగల్లు, వేంపాడు ,మారెళ్ళ, ఉమామహేశ్వరరావు తమలూరు శంకరాపురం పూరిమెట్ల ఈ దర, భీమవరం, పసుపుగల్లు, శంకరాపురం, పోలవరం ,సింగరపాలెం, తదితర గ్రామాలలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ పాపుల రక్షకుడు క్రీస్తు అని అన్నారు. వారి వారి కుటుంబాలలో పెద్దలు మృతి చెందిన ఎడల వారి సమాధులను శుభ్రం చేస్తారు. వారి ఆత్మలు క్రీస్తు సన్నిధిలో చేరాలని ప్రార్థనలు చేస్తారు. యేసు మృతి చెంది, మృత్యుంజయుడై మూడవరోజు క్రీస్తు పునరుద్దాన దినాన్ని ఈస్టర్ పండుగ అంటారు. క్రైస్తవులు వేకువ జాము నుండే స్తుతి గీతాలు ఆలపించి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. క్రీస్తు సర్వ లోక పాపాల నిమిత్తం సిలువలో బలి యాగమై శుభ శుక్రవారం రోజున సమాధి కాబడి మూడవ రోజైన ఆదివారం తిరిగి లేచాడన్నారు. యేసు చూపిన జాలీ, దయా, క్షమాగుణం, ఆచరణీయమన్నారు. క్రీస్తును నమ్మిన వారు 40 రోజు ఉపవాస ప్రార్థనలు చేసి ఆదివారం నాడు ఈస్టర్ పండుగను జరుపుకున్నారు. పాస్టర్ దేవా సొత్తు స్వామి నాయక్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *