రూ. 2లక్షల కోట్లు ప్రజలకు అందించటం చారిత్రాత్మకం – సీఎం వైఎస్ జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుకుందాం- 2024లో మళ్లీ సీఎంకు చేసుకుందాం – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా నాలుగు సంవత్సరాలలో డైరెక్ట్ బెనిఫియర్ ట్రాన్స్ఫర్ ద్వారా రెండు లక్షల కోట్లు అందించటం చారిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గుంటి గంగా భవాని తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివరామపురం, కొత్తపాలెం, రమణాల వారిపాలెం, మాధవరం విద్యుత్ ప్రభలపై ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ …ప్రజల ఇబ్బందులను తీర్చటానికి వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసి ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ నన్నకు ప్రతి ఒక్కరూ రుణ పడి ఉండాలని చెప్పారు. 2019లో అత్యధిక మెజార్టీ ఇచ్చి సీఎం వైఎస్ జగనన్నను, నన్ను ఆదరించారని, 2024లో కూడ రెట్టింపు ఉత్సాహంగా పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించినట్లయితే మీకు సేవకుడిగా పనిచేస్తానని చెప్పారు. అనేక సవాళ్లు ఎదుర్కొంటూ నిత్యం ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తున్నానని, 2024లో కూడ సీఎం వైఎస్ జగనన్న ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల నుండి ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజా సేవలో కొనసాగుతానని స్పష్టం చేసారు. తాళ్లూరు, దర్శి ఎంపీపీలు తాటికొండ శ్రీనివాసరావు, గోళ్లపాటి సుధా అచ్చయ్య, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం.ఎన్. పి నాగార్జున రెడ్డి, తాళ్లూరు, దర్శి జెసీఎస్ కన్వినర్లు యాడిక శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వర్లు, శివరామపురం మాజీ సర్పంచి నిశంకం వెంకటేశ్వర్లు, హనుమంతరావు, శింగరకొండ, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, చిన ఆంజనేయులు, సోసైటీ చైర్మన్లు, సర్పంచిలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచిలు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *