ముండ్లమూరు( గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల వైద్యుల సలహాలు పాటించాలని వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఎండలు కాసే సమయంలో బయటకు తిరగరాదన్నారు. మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి వైద్యులను సంప్రదించి వైద్య సలహాలు పొందాలన్నారు. ఈ శిబిరంలో 65 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెచ్ వి ఎస్.కె హుస్సేన్ బి, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సిబ్బంది పాల్గొన్నారు.
